ట్రక్ డ్రైవర్‌ల కోసం మూడు భాషల్లో సేఫ్టీ గైడ్
- July 22, 2022
రియాద్ : రవాణా జనరల్ అథారిటీ తన వెబ్‌సైట్‌లో (tga.gov.sa) అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఒక గైడ్‌ను జారీ చేసింది. ఇందులో ట్రక్ డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన, అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. అలాగే డ్రైవర్ కోసం సూచనలు, నైపుణ్యాలు, హక్కులు గురించి వివరించారు. వాహనాన్ని తనిఖీ చేయడం, సౌదీ స్టాండర్డ్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం ట్రక్కుల కొలతలు, బరువులు తెలుసుకోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాన్ని నియంత్రించడం, ప్లాన్ చేయడం, పర్యవేక్షించడం వంటి సూచనలను కూడా గైడ్ లో పొందుపరిచారు. 11-భాగాల గైడ్ ట్రక్ డ్రైవర్లు వృత్తిపరమైన, సురక్షితమైన డ్రైవింగ్ కోసం ప్రజా భద్రతా అవసరాలను తెలుసుకోవడంలో సహాయపడే లక్ష్యంతో గైడ్ ను జారీ చేసినట్లు రవాణా జనరల్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







