పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత
- July 22, 2022
అమరావతి: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె.. శతాధిక వృద్ధురాలయిన ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో రాత్రి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.వందేళ్ల జెండా పండుగ సందర్భంగా గతేడాది సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో పాటుగా కుటుంబ సభ్యులను సన్మానించారు. రూ 75 లక్షలను అందించారు.
వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతి. దీనిని పురస్కరించుకొని కేంద్రం సీతామహాలక్ష్మిని ఢిల్లీ తీసుకెళ్లేంందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె కన్నుమూశారు. మధ్యాహ్న సమయంలో అస్వస్థతగా అనిపించడంతో తనతో పాటు ఇంట్లోనే ఉన్న కుమారుడు నరసింహానికి తాను చనిపోతున్నానంటూ చెప్పారు. అయితే నీకేం కాదంటూ నరసింహం ఆమెకు ధైర్యం చెప్పారు. రాత్రి 8గంటల సమయంలో ఆమెలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుమారుడు వైద్యునికి ఫోన్ చేయగా ఆయన పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. సీతామహాలక్ష్మికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం.
జాతీయ జెండా రూపొందించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గతేడాది మార్చి 12న సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో ముచ్చటించారు. అలాగే ఈ ఏడాది మే 10న తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాచర్ల చేరుకొని సీతామహాలక్ష్మిని కలిశారు. పింగళి సీతామహాలక్ష్మీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







