హైదరాబాద్ లో భారీ వర్షం...
- July 22, 2022
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది.. జూబ్లీహిల్స్, మూసాపేట్, కేపీహెచ్ బి యూసుఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఇక్కట్లు పడుతున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ , కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







