యూఏఈలో ఆసియా కప్..
- July 22, 2022
ముంబై: శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియా కప్ టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ తెలిపారు.ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు శ్రీలంక క్రికెట్ సొంతం చేసుకుంది.ఈసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ICC) నిర్ణయించింది.అయితే, తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా టోర్నీని నిర్వహించలేమని లంక బోర్డు బుధవారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో టోర్నీ యూఏఈలో జరుగుతుందని, ఈ సమయంలో అక్కడ అయితేనే వర్షాలు పడవని గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్ సమావేశానికి హాజరైన గంగూలీ చెప్పారు.మరో వైపు 2022-23లో పూర్తిస్థాయి దేశవాలీ సీజన్ జరుగుందని స్పష్టం చేశారు.కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఆగిపోయిన దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ టోర్నీలను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







