వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన కోటా విడుదల...
- July 22, 2022
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







