హైదరాబాద్ రోడ్ల పై కొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
- July 23, 2022
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఫేమ్-2 పథకం కింద 300 బస్సులు తీసుకోనేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి ఈ వాహనాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.500 కోట్లను చెల్లించనుంది. 12 సంవత్సరాలకు గానూ… గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను తీసుకోనుంది. వచ్చే 20 నెలల్లో ఈ బస్సులను ఒలెక్ట్రా.. టీఎస్ఆర్టీసీకి అప్పగించనుంది.వీటి నిర్వహణ బాధ్యతలను ఒలెక్ట్రా చూడనుంది. ప్రతి సీటుకు ఎమర్జెన్సీ బటన్ తో పాటు USB సాకెట్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కిమీ వరకు ప్రయాణం చేస్తుంది.
ఈ బస్సులు 12-మీటర్లు, లో ఫ్లోర్, నాన్-ఏసీ బస్సులు 35+డి సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్‌తో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉంటాయి. బస్సులో అమర్చిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఒక ఛార్జ్‌తో 180 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ మరో ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ అత్యాధునిక జీరో-ఎమిషన్ బస్సులతో తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా తమ బస్సులు హైదరాబాద్‌లో సేవలు అందిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రయాణికులను విమానాశ్రయానికి విజయవంతంగా చేరవేస్తూ సేవలు అందిస్తున్నాయని చెప్పారు. తాము షెడ్యూల్ ప్రకారం బస్సులను అందజేస్తామని, ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!