‘ఊ అంటావా మామా..’ ఈ పాట సమంత ఎందుకు చేసిందో తెలుసా.?
- July 23, 2022
ఫస్ట్ టైమ్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ అది. ఊహించని విధంగా హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే చాలా వివాదాస్పదమూ అయ్యింది. సినిమాకి ఆ పాట మెయిన్ అస్సెట్ కూడా అయ్యింది.
ఆ పాటే, ‘ఊ అంటావా మామా.. ఊ ఊ అంటావా మామా..’ ‘పుష్ప’ సినిమా కోసం సమంత ఈ స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్యాన్ ఇండియా రేంజలో ఈ స్పెషల్ సాంగ్ ఓ ఊపు ఊపేసింది.
అయితే, ఈ పాట సమంత ఒప్పుకోవడం వెనక చాలా పెద్ద రీజనే వుందట. ఆ విషయాన్ని తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఏంటా రీజన్ అంటే.!
నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే ఈ పాటలో నటించే చాన్స్ వచ్చిందట సమంతకు. పాటలోని లిరిక్స్ చాలా నచ్చేశాయట. తన సిట్యువేషన్‌కి యాప్ట్ అనిపించిందట. పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఈ పాట బాగా ఉపయోగపడుతుందని సమంత భావించిందట.
తనలాంటి ఓ స్టార్ హీరోయిన్ ఆ పాటలో నటిస్తేనే రీచ్ ఎక్కువగా వుంటుందని సమంత వెంటనే ఆ సాంగ్‌లో నటించేందుకు ఒప్పేసుకుందట. అలా ‘పుష్ప’లో ఆ పాట సమంత ద్వారా ప్యాన్ ఇండియా మొత్తం ఊఫు ఊపేసిందన్నమాట.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







