వావ్.! నిఖల్ ప్రమోషన్ అదరగొట్టేశాడు కానీ.!
- July 23, 2022
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ నటించిన ‘కార్తికేయ 2’ జూలై 22న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అయితే, అనూహ్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాకా, ప్రమోషన్లపై దృష్టి పెట్టాలి కదా.. అందులో భాగంగానే ‘కార్తికేయ 2’ ప్రమోషన్లు మొదలయ్యాయ్. ఈ సారి ఇంకొంచెం కొత్తగా ప్లాన్ చేశారు ప్రమోషన్లు.
అందులో భాగంగానే స్పెషల్ ఇంటర్వ్యూలూ, సినిమా అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటూ, సరికొత్త ఎంట్రీలు కూడా ప్లాన్ చేశారు. బుల్లితెరపై స్పెషల్ ఎంట్రీలతో ఈ సినిమాని ప్రమోట్ చేయాలనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ పాపులర్ సీరియల్‌లో నిఖిల్ సిద్దార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ వేదికగా ఆడియన్స్‌తో షేర్ చేశాడు.
ఈ శనివారం బుల్లితెరపై నిఖిల్ ఎంట్రీ వుండబోతోందన్న మాట. అందుకోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని కూడా ప్లాన్ చేశారు సీరియల్ నిర్వాహకులు. అంతా బాగానే వుంది. కానీ, పోస్ట్ పోన్ అయిన ‘కార్తికేయ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఆగస్టులో అన్నారు కానీ, డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







