విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన బండ్ల గణేష్.!

- July 23, 2022 , by Maagulf
విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన బండ్ల గణేష్.!

 తనకు గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చిన అంశాల మీద రెస్పాండ్ అవుతుంటాడు కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్. ఏదో మామూలుగా రెస్పాండ్ అయితే ఆయన్నిఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అందుకే తనకో డిఫరెంట్ స్టైల్ వుంది. ఆ స్టైల్‌లో రెస్పాండ్ అయ్యి ట్రెండింగ్ అవుతుంటాడు.

అలా తాజాగా బండ్ల గణేష్‌కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టార్గెట్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, విజయ్ నటించిన ‘లైగర్’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ట్రైలర్ లాంఛింగ్ వేడుక ఘనంగా జరిగింది.
ఆ వేడుకలోనే ‘నా తండ్రి ఎవ్వరో తెలీదు, తాత ఎవ్వరో తెలీదు.. నాపై మీకు ఇంత పిచ్చి అభిమానమా.?’ అంటూ భారీగా తనకోసం తరలి వచ్చిన అభిమానులను వుద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడారు. అయితే, ఆ మాటలను పెద్దగా తప్పు పట్టడానికేమీ లేదు. 
అవును నిజమే, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్‌డమ్ దక్కించుకున్నచాలా తక్కువ మంది హీరోల్లో విజయ్ ఒకరు. బహుశా అంతమంది ఫ్యాన్స్‌ని చూడగానే, ఆ ఎగ్జైట్‌మెంట్‌లో విజయ్ అలా మాట్లాడి వుండొచ్చు. అయితే, ఆ మాటలే మన బండ్ల గారికి తప్పుగా అర్ధమయ్యాయట. 
‘తాతలూ, తండ్రులూ వుంటే సరిపోదు బ్రదర్.. అలా వున్నవాళ్లు సైతం తమ స్వయం కృషితో పైకి వచ్చినవాళ్లే..’ అని విజయ్ పేరు చెప్పకుండా పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ కౌంటర్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, కొందరు విజయ్‌ని సపోర్ట్ చేస్తున్నారు కూడా.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com