జాతీయ అవార్డులు: సత్తా చాటిన సౌత్ సినిమాలు.!

- July 23, 2022 , by Maagulf
జాతీయ అవార్డులు: సత్తా చాటిన సౌత్ సినిమాలు.!

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ఎంపిక తాజాగా జరిగింది. ఈ అవార్డుల్లో ముఖ్యంగా సౌత్ సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ సినిమా అవార్డును ‘కలర్ ఫోటో’ దక్కించుకుంది. కమెడియన్ సుహాస్, ఛాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా ధియేటర్లలోనూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది ‘కలర్ ఫోటో’.
ఇక, ఉత్తమ హీరో అవార్డును తమిళ నటుడు సూర్య దక్కించుకున్నాడు. ఆయన నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకిగాను ఈ అవార్డు దక్కింది. అంతేకాదు, ఈ సినిమాకి మరో నాలుగు అవార్డులు కూడా దక్కాయ్. ఉత్తమ నటి అవార్డును హీరోయిన్ అపర్ణా బాల మురళి దక్కించుకోగా మిగిలిన విభాగాల్లో మరో మూడు అవార్డులు దక్కించుకుంది.
డాన్స్ ప్రధానాంశంగా తెరకెక్కిన ‘నాట్యం’ సినిమాకి రెండు అవార్డులు దక్కాయ్. సత్యం కంప్యూటర్స్ అధినేత సత్యం రామలింగరాజు కోడలు సంధ్యారాణి ప్రధాన పాత్రలో రూపొందిన ‘నాట్యం’ సినిమాకి ఉత్తమ కొరియోగ్రఫీ, తదితర భాగాల్లో రెండు అవార్డులు దక్కాయ్.
మలయాళ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ (తెలుగు రీమేక్ భీమ్లా నాయక్) సినిమాకి కూడా రెండు అవార్డులు దక్కాయ్. ఉత్తమ సహాయ నటుడిగా బీజూ మీనన్, ఉత్తమ దర్శకుడు దివంగత సచిదానందన్ ఈ అవార్డులు దక్కించుకున్నారు. అలాగే బాలీవుడ్ విషయానికి వస్తే, ‘తానాజీ’ సినిమాకి గాను అజయ్ దేవగణ్ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com