ఓటీటీ కంటెంట్: ఒపీనియన్ మార్చుకోవాలి బాస్.!

- July 23, 2022 , by Maagulf
ఓటీటీ కంటెంట్: ఒపీనియన్ మార్చుకోవాలి బాస్.!

ఒకప్పుడు ఓటీటీ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ అన్న అభిప్రాయం బలంగా వుండేది . కానీ, ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. సినిమాల్లో ఏముంటుంది గొప్ప. నాలుగు పాటలూ, మూడు ఫైట్లూ, రొటీన్ కామెడీలు, రెగ్యులర్ కమర్షియల్ స్టోరీలు.. ఇంతే కదా.
కానీ, ఓటీటీ కంటెంట్‌లో అలా కాదు. చాలా జన్యూన్ అటెంప్ట్ చేస్తున్నారు. కమర్షియల్ యాంగిల్‌ని అస్సలు దృష్టిలో పెట్టుకోవడం లేదు. దాంతో కంటెంట్ రిచ్ పోకుండా, జెన్యూన్‌గా తాము ఏం చెప్పాలనుకుంటున్నారో, అదే చెబుతున్నారు.

బెస్ట్ అవుట్ పుట్ వస్తోంది ఓటీటీ కంటెంట్‌లో. దాంతో, సినిమాలపై బొత్తిగా ఆసక్తి పోయింది సినీ ప్రియులకు. థ్రిల్లర్ కాన్సెప్ట్ అయినా, ప్యూర్ కామెడీ కాన్సెప్ట్ అయినా ఎక్కడా ఫ్లేవర్ చెడిపోకుండా గ్రిప్పింగ్‌గా లాక్కొస్తున్నారు. 

ముఖ్యంగా చెప్పుకోదగ్గదేంటంటే, నటీ నటులు తమలోని జెన్యూన్ పర్‌ఫామెన్స్‌ని బయటికి తీసే అవకాశం కేవలం ఓటీటీ సినిమాల ద్వారానే సాధ్యపడుతోంది. అందుకేనేమో, నెంబర్ వన్ స్టార్స్ సైతం ఓటీటీలో మెరిసిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇది నిజంగా మంచి పరిణామమే అని చెప్పాలి. టాలెంట్ వుండీ, సినిమాల్లో అవకాశాలు రాక సతమతమవుతున్న చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఓటీటీ వేదికగా తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com