టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు...
- July 23, 2022
తిరుమల: కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది.జులై నెలలో టీటీడీలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది.శ్రీవారి భక్తులు కోనేటి రాయుడికి జులై నెలలో కాసుల వర్షం కురిపించారు.ఈ నెల శ్రీవారి ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది.కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు రద్దీ పెరిగింది.శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు.
మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది.దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.జులై 1వ తేదీ నుంచి జులై 21వ తేదీ వరకు శ్రీవారికి హుండీ ద్వారా 100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది.టీటీడీ చరిత్రలో అత్యధిక ఆదాయం ఈనెలాఖరులోపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు గత మే నెలలో వచ్చిన 130 కోట్ల రూపాయలే అత్యధిక ఆదాయం కాగా… జులై 31 నాటికి 140 కోట్ల రుపాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.గత ఐదు నెలలుగా స్వామివారి ఆదాయం 100 కోట్ల మార్కును దాటి ఆదాయం వస్తోందని అధికారులు వివరించారు.ఈ ఏడాది మార్చిలో 128 కోట్ల రూపాయలు…ఏప్రిల్ నెలలో 127.5 కోట్లు… మే నెలలో 130.05 కోట్లు.. జూన్ లో 123 కోట్ల రూపాయలు ఆదాయం రాగా జులై మాసంలో ఇప్పటికే స్వామి వారి ఆదాయం 100 కోట్ల 5 లక్షలుకు చేరింది.
టీటీడీ చరిత్రలో ఈ జులై నెల4 వతేదీన అత్యధికంగా రూ. 6.18 కోట్లు ఆదాయం లభించింది.ఈ నెలలో ఇంకో పదిరోజులు హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా కొత్త చరిత్ర సృష్టిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఐదు నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.650 కోట్లను క్రాస్ చేయగా..ఈ ఏడాది మొత్తం ఆదాయం 1500 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







