గల్ఫ్ టీడీపీ కౌన్సిల్ అధ్యక్షుడిగా రావి రాధాకృష్ణ
- July 23, 2022
సౌదీ అరేబియా: తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్నారై విభాగం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లా మల్కిపురానికి చెందిన ప్రవాస పారిశ్రామికవేత్త, సౌదీ అరేబియా నివాసి రావి రాధాకృష్ణను నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 25 ఏళ్లుగా ఆయన టీడీపీ పటిష్ఠతకు పని చేస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో టీడీపీ కమిటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.గత టీడీపీ ప్రభుత్వంలో ప్రవాసీయుల కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏపీఎన్‌ఆర్టీని గల్ఫ్ దేశాల్లో విస్తరించడంలో రాధాకృష్ణ కీలకంగా వ్యవహించారు. శృంగవరపుపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ స్వచ్ఛ నీటి కేంద్రం, డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు దేవాలయాల పునరుద్ధరణ వంటి పనులు చేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







