మహోసాధ్వీమణి
- July 23, 2022
మొదటి మహిళ "ముర్ము"
భారతావని ఒడిలో జననం
ఆదిమవాసిలో మెరిసిన హిమం
వికసించిన సుగంధ *భరిత* కుసుమం
మమతానురాగాల మాధుర్యం
బాధలను మరిపించి మురిపించే అతివ
సవాళ్ళను *ఎదురొడ్డిన* నారీమణి
అత్యంత పేదరికం - విషాధభరిత జీవితం
గర్భశోకాన్ని తట్టుకొన్న ఓ సాధ్వి *మణి*
కన్నీళ్ళని దాచుకొని - చిరునవ్వులు చిందిస్తు
ఆత్మవిశ్వాసమే అలంకరణగా
చీకటి గూళ్ళలో వెలుగులు నింపిన
పలు బాధ్యతలు నిర్వహించిన
బంధాలలో అల్లుకుపోయిన *మల్లికామణి*
ఏ ఆటంకం ఎదురైనా చెదరక బెదరక
ఆశయసాధనలో తన వారి కోసం-
అలుపెరగని శ్రామిక శక్తి *శిరోమణి*
గిరిప్రపంచ *తారామణి*
అవిశ్రాంత మోర్చ *అధ్యక్షమణి*
ప్రజాస్వామ్యం లో రాష్ట్రపతి పీఠం
అధిరోహించిన నేటి ద్రౌపది మహిళామణి
అంచెలంచెలుగా ఎదిగిన యోధ *శిఖామణి*
నింగిలోనైనా నేలలోనైనా ఓ మగువ
నీకు ఎవరులేరు సాటి - ఇక నీవే మమ్మునడిపే *సారథీమణి*.
--యామినీ కోళ్లూరు, అబుదాభి
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్‌లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..