భారత రాష్ట్రపతి కి ఉపరాష్ట్రపతి మర్యాదపూర్వక విందు
- July 23, 2022
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మర్యాద పూర్వక విందు ఏర్పాటు చేశారు.న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కుటుంబ సమేతంగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ, కుమారుడు హర్షవర్ధన్ లతో కలిసి అచ్చతెలుగు వంటకాలతో విందు ఆరగించారు.
రాష్ట్రపతిగా ఐదేళ్ళ పదవీ కాలాన్ని రామ్ నాథ్ కోవింద్ ఎంతో హుందాగా నిర్వహించారన్న ఉపరాష్ట్రపతి, వివిధ కీలక సందర్భాల్లో వారు వ్యవహరించిన తీరు వారి చక్కని పని తీరుకు నిదర్శనంగా నిలిచిందన్నారు.వారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న ఆయన, కోవింద్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమైనదని, ఆయన ఆలోచనలు, సందేశాలు, ప్రసంగాల నుంచి ఈతరం యువత ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు.వారి భవిష్యత్ జీవితం ఆరోగ్యకరంగా, అర్ధవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







