బహ్రెయిన్ లో కొత్త పబ్లిక్ బీచ్ పార్క్
- July 23, 2022
బహ్రెయిన్: వాకింగ్ వే, ప్లేయింగ్ స్థలాలు, ఇతర సౌకర్యాలతో పూర్తి స్థాయిలో బహ్రెయిన్ అన్విల్‌లో కొత్త పబ్లిక్ బీచ్ పార్క్ రానుంది. నార్తర్న్ గవర్నరేట్‌లో కొత్త పబ్లిక్ బీచ్ రానుందని వర్క్స్ మినిస్ట్రీ టెండర్ విభాగం తెలిపింది. టెండర్ నోటీస్ ప్రకారం.. రాబోయే బీచ్ పార్క్లో ల్యాండ్‌స్కేప్, ప్లేగ్రౌండ్, కంఫర్ట్ సర్వీసెస్, కేఫ్‌లు, షాపులు, కార్ పార్క్‌లు, ఇతర సౌకర్యాలతో కూడిన వాక్‌వే ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. నార్తర్న్ గవర్నరేట్‌లోని కర్జాకాన్ బ్లాక్ 1027లో కొత్త పబ్లిక్ బీచ్ పార్క్ రూపకల్పన, పర్యవేక్షణ కోసం బీచ్‌ల రూపకల్పన, తీరప్రాంత అభివృద్ధిలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీ సంస్థను నియమించడం కోసం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి ఆసక్తి ఉన్నవారు, BD1,000 బాండ్, BD50 టెండర్ రుసుముతో ఆగస్టు 24, 2022లోపు టెండర్ వేయాలని వర్క్స్ మినిస్ట్రీ కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







