28 కార్లను తొలగించిన కువైట్ మునిసిపాలిటీ

- July 23, 2022 , by Maagulf
28 కార్లను తొలగించిన కువైట్ మునిసిపాలిటీ

కువైట్: జ్లీబ్ అల్-షుయౌఖ్, సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతాల నుండి 28 పాడుబడిన కార్లను కువైట్ మునిసిపాలిటీ తొలగించింది. జహ్రాకు దక్షిణాన ఉన్న సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతం నుంచి 15 కార్లు.. జిలీబ్‌ నుంచి 13  కార్లు తొలగించిన వాటిలో ఉన్నాయని ఫర్వానియా మున్సిపాలిటీకి చెందిన జనరల్ క్లీన్‌లీనెస్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ డాక్టర్ నాసర్ అల్-రషీది తెలిపారు.  జ్లీబ్ అల్-షుయౌఖ్‌, జిలీబ్‌లలో క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా పాడుబడిన 28 గుర్తించి, వాటిని మున్సిపాలిటీ రిజర్వేషన్ సైట్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కార్ల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com