ఖతార్‌లో నాలుగువారాల యూత్ సమ్మర్ ప్రోగ్రామ్‌

- July 25, 2022 , by Maagulf
ఖతార్‌లో నాలుగువారాల యూత్ సమ్మర్ ప్రోగ్రామ్‌

దోహా: దోహా ఫైర్ స్టేషన్ తన వార్షిక యూత్ సమ్మర్ ప్రోగ్రామ్‌ను ఖతార్‌లోని యువ కళాకారుల కోసం ప్రకటించింది. హజీమ్ అల్ హుస్సేన్, నూఫ్ అల్ థెయాబ్, నూరా అల్ సై, పౌలా బౌఫర్డ్ పేరిట వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం జూలై 31న ప్రారంభమై.. సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుంది.

హజిమ్ అల్ హుస్సేన్: యాక్రిలిక్ పెయింటింగ్ టెక్నిక్స్

తేదీ: జూలై 31 - ఆగస్టు 4, 2022

యాక్రిలిక్ పెయింట్‌ను ఉపయోగించి వివిధ పెయింటింగ్ పద్ధతులు, సాంకేతికతలను వివరిస్తారు.

నూఫ్ అల్ థెయాబ్: రెసిన్ ఆర్ట్

తేదీ: ఆగస్టు 7-11, 2022

రెసిన్‌ను ఉపయోగించడం, విభిన్న అచ్చులు, పదార్థాలతో ప్రయోగాలు చేయడం నేర్పుతారు.

 

నూరా అల్ సై

తేదీ: ఆగస్టు 21-25, 2022

వివిధ రకాల యానిమేషన్‌ల రూపకల్పన, మార్గనిర్దేశం చేస్తారు.

పౌలా బౌఫర్డ్: ఫాబ్రిక్ ప్యాటర్నింగ్ & డిజైన్

తేదీ: ఆగస్టు 28 - సెప్టెంబర్ 1, 2022

వివిధ సాంకేతికతలను ఉపయోగించి ఫాబ్రిక్‌పై ఎలా ప్రింట్ చేయాలో నేర్పుతారు.

ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ కోసం https://firestation.org.qa/en/calendar/ వెబ్ సైట్ ను చూడాలని నిర్వాహకులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com