‘తీస్ మార్ ఖాన్’ నుంచి ‘సమయానికే’ వీడియో సాంగ్ విడుదల
- July 25, 2022
హైదరాబాద్: విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్. ఆయన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ సింగిల్ పాప ఆగవే అంటూ సాగే ఈపాటలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘సమయానికే’ అంటూ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఇది మెలోడీ గీతం కాగా.. ఇందులో ఆది, పాయల్ రాజ్‌పుత్‌ల జోడి ఆకట్టుకుంది. ఈ పాటలో పాయల్ అందాలు హైలెట్ అవుతున్నాయి. ఆది సాయి కుమార్ ఈ పాటలో షర్ట్ లేకుండా కనిపించారు. ఇక ఆయన చేసిన వర్కవుట్లు, శరీరాకృతిని మార్చుకునేందుకు పడిన కష్టం ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తోంది.
ఇక ఈ పాట సాయి కార్తీక్ అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను అందించగా..రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు. ఇక శృతి ఈ పాటను ఆలపించారు. ఈ వీడియో సాంగ్‌లో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్‌లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు.
ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.
ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీనటులు
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యాళ్ల తిర్మల్ రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







