30 రోజుల్లోనే ఎమిరేట్స్ ఐడీ కార్డులో మార్పులు చేసుకోవచ్చు

- July 25, 2022 , by Maagulf
30 రోజుల్లోనే ఎమిరేట్స్ ఐడీ కార్డులో మార్పులు చేసుకోవచ్చు

యూఏఈ: దేశ పౌరులు మరియు నివాసితులు తమ ఎమిరేట్స్ ఐడీ కార్డులో మార్పులు కేవలం 30 రోజుల్లోనే చేసుకోవచ్చని ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ (ICA) ను నిర్వహించే యూఏఈ డిజిటల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 

ఈ ప్రకటన ద్వారా పౌరులు మరియు నివాసితుల ఐడీలలో  భారీగా మార్పులు చేర్పులు జరగడమే కాకుండా పలు నూతన ఐడీ కార్డులు జారీ చేయడం కూడా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఐడీ లో మార్పులు కోసం ఏటువంటి ధృవీకరణ పత్రాలను సమర్పించవలసిన అవసరం లేదని కేవలం సేవా రుసుము కింద Dh50 చెల్లించాలి అని పేర్కొన్నారు. 

ఒక వేళ దేశాన్ని విడిచి పెట్టాలని ఆలోచన ఉన్న వారి ఐడీ కార్డులను త్వరత గతిన రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందు కోసం వారు విదేశీ వ్యవహారాలు మరియు నివాసిత డిపార్ట్మెంట్ లో తమ కార్డును జమ చేస్తే సదరు డిపార్ట్మెంట్ వారు ICA కు అందజేస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com