ఎట్టకేలకు స్వీటీ పెళ్లంట.! ఈ సారైనా నిజమేనా.!
- July 25, 2022
స్వీటీ అనుష్క ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందట. ‘నిశ్శబ్ధం’ సినిమా తర్వాత అనుష్క సినిమాల్లో నటించింది లేదు. ఇదిగో వస్తుందట.. అదిగో వస్తుందట.. అంటూ గుప్పు గుప్పు ప్రచారాల పర్వమే. కానీ, స్వీటీ సినిమా వచ్చింది లేదు.
సినిమాల సంగతి అలా వుంటే, పెళ్లి ముచ్చట కూడా అలాగే వుంది స్వీటీ అనుష్క జీవితంలో. ప్రబాస్‌తో పెళ్లి అంటూ, చాలా సార్లు ప్రచారం జరిగింది. ఇంకేముంది.. ప్రబాస్ ఇంట్లోని ముఖ్యమైన ఫంక్షన్లకు అనుష్క హాజరవుతోంది.. ఇంట్లోని మనిషిలా తెగ కల తిరిగేస్తోంది.
ఇక వీళ్లిద్దరి పెళ్లి కావడం నిజమే.. అంటూ నెక్స్‌ట్ లెవల్ స్పెక్యులేషన్ కూడా జోరందుకుంది. కానీ, ఎప్పటిలాగే తూచ్.! అవన్నీ వుత్త మాటలే.. అంటూ ఇటు ప్రబాస్, అటు అనుష్క ఇద్దరూ కొట్టిపడేశారు.
ఇక తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి ముచ్చట తెరపైకి వచ్చింది. ఈ సారి ఇంకాస్త కొత్తగా. బెంగుళూరుకు చెందిన ఓ ప్రముఖ బిజినెన్ మేన్‌తో స్వీటీ వివాహం నిశ్చయమైందనీ, ఈ ఏడాది చివర్లోనే స్వీటీ పెళ్లి వుంటుందనేది ఆ వార్త సారాంశం.పెళ్లి తర్వాత స్వీటీ అనుష్క పూర్తిగా సినిమాలకు బ్రేకిచ్చేయనుందట. ఇదీ తాజా అప్డేటే. ఇక ప్రస్తుతం అనుష్క, ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!