ఏపీ, తెలంగాణ అప్పుల వివరాలు విడుదల
- July 25, 2022న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు 2022 మార్చి 31 నాటికి 3లక్షల 98వేల 903 కోట్ల రూపాయల అప్పు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రానికి 3లక్షల 12వేల 191 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాల అప్పుల వివరాల గురించి లోక్ సభ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో ఏయే రాష్ట్రం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత మొత్తం రుణంగా తీసుకుందని అనే విషయాన్ని కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రాల రుణాల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మూడేళ్లలో తీసుకున్న రుణాలతో జాబితాను రూపొందించింది. బడ్జెటేతర రుణాలను మాత్రం కేంద్రం ఈ జాబితాలో పొందుపరచలేదు. బడ్జెట్ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది.
ఏపీలో అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,07,671 కోట్లుగా కాగా.. 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,60,333 కోట్లు. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఇక తెలంగాణ రాష్ట్రం అప్పుల విషయానికి వస్తే.. 2020 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.2,25,418 కోట్లు. 2021 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.2,67,530 కోట్లు. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ.3,12,191 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పుల్లో తమిళనాడు 6 లక్షల 59వేల 868 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. 6 లక్షల 53 వేల కోట్లతో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మహారాష్ట్ర 6 లక్షల 8 వేల కోట్లతో అప్పుల్లో మూడో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 5 లక్షల 62 వేల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా 4 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయని నిర్మాలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 8 ఏళ్లలో 3లక్షల 12వేల కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ మండిపడ్డారు. ఇంత అప్పు చేసినా తెలంగాణ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో తెలంగాణలో ప్రతి వ్యక్తిపై లక్ష రూపాయల రుణభారం ఉందన్నారు. శ్రీలంక పరిస్థితి… తెలంగాణ ప్రజలకు రావొద్దనే అప్పుల లెక్కలను బయటపెడుతున్నామని ఉత్తమ్ అన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పు రూ. 3,12,191.3 కోట్లు ఉన్నట్లు ఉత్తమ్ తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు అవసరానికి మంచి ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను రాతపూర్వకంగా ఆర్ధిక శాఖ సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?