ట్రెండు మారింది బాస్.! మీరెప్పుడు గుర్తించరా.. బిగ్ బాస్.!

- July 25, 2022 , by Maagulf
ట్రెండు మారింది బాస్.! మీరెప్పుడు గుర్తించరా.. బిగ్ బాస్.!

జనామోదం వున్న సినిమాల్లో మాత్రమే నేను నటిస్తాను.. ప్రయోగాల జోలికి అస్సలు పోను.. అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అమీర్ ఖాన్ మంచి నటుడు.. అని అభివర్ణిస్తూ, ఆయన చేసే సినిమాల తరహా సినిమాలు నేను చేయలేను.. నేను ప్రజామోదం వున్న సినిమాలు మాత్రమే చేయగలను.. అని చిరంజీవి సెలవిచ్చారు.

అంటే, ప్రయోగాల జోలికి పోనని చిరంజీవి క్లియర్ కట్‌గా చెప్పేశారు. కానీ, సినిమాల విషయంలో ఆడియన్స్ ఆలోచనలు చాలా వేగంగా మారిపోతున్నాయ్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంకరేజ్ చేయడం లేదు కూడా.
అంతేకాదు, చిరంజీవి యంగ్ జనరేషన్‌కి ఇన్సిస్రేషన్. యంగ్ జనరేషన్ నుంచి మంచి మంచి ప్రయోగాత్మక సినిమాలు రావాలని సూచనలిచ్చే చిరంజీవి ఆయన కూడా ప్రయోగాలు చేయాలి కదా. వెరసి, ‘విక్రమ్’ సినిమాతో సీనియర్ నటుడు కమల్ హాసన్ ఓ పెద్ద ప్రయోగమే చేశాడు. అభిమానులూ ఆదరించారు.

అలాగే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పలు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తున్నారు. మరి, చిరంజీవి ఎందుకు చేయకూడుదు అధ్యక్షా.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com