‘ఏజెంట్’ పై కామెంట్లు: ప్రొడ్యూసర్ అంత కాన్పిడెంట్‌గా వున్నాడా.?

- July 25, 2022 , by Maagulf
‘ఏజెంట్’ పై కామెంట్లు: ప్రొడ్యూసర్ అంత కాన్పిడెంట్‌గా వున్నాడా.?

అక్కినేని అందగాడు అఖిల్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే, అఖిల్‌పై అంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకూ సబబు.? అంటూ అన్ని పక్కల నుంచీ అనిల్ సుంకరపై ఒత్తిడులు పెరుగుతున్నాయట. అందుకు ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా స్పందించారు. ‘ఏజెంట్’ కథపై, మేకింగ్‌పై తనకు చాలా నమ్మకముందనీ ఆయన తెలిపారు.
అందుకే వెనక్కి తిరగి చూడకుండా, అంత బడ్జెట్ పెట్టేశాననీ ఆయన వివరించారు. అంతే కాదు, బడ్జెట్‌కి తగ్గట్లే అఖిల్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడనీ, మేకోవర్ కోసం అఖిల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డికీ ఈ సినిమా ఓ ఛాలెంజ్‌లాంటిది.. ఆయన చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాతో అఖిల్ గట్టిగా కొట్టడం ఖాయం అని అనిల్ సుంకర చెబుతున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైంది. టీజర్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. మరి, అనిల్ సుంకర కాన్ఫిడెన్స్ చూస్తుంటే, అఖిల్ నిజంగానే ‘ఏజెంట్’‌తో గట్టిగా కొడతాడా.? ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవ్వకుండా, అనూహ్యమైన అంచనాల్ని క్రియేట్ చేస్తాడా.? చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com