మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఫేజ్-2 ప్రారంభించిన APSSDC
- July 25, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫీ-స్పార్క్ & నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ యొక్క ఫేజ్-2 తాడేపల్లి కార్యాలయములో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి లాంచనంగా ప్రారంబించారు. ఈ కార్యక్రమములో స్కిల్ డెవలప్మెంట్ ఎండి&సి.ఈ.ఓ ఎస్.సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రామకోటి రెడ్డి, gm గోపినాథ్ మరియు మైక్రో సాఫ్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ Mr.అర్నవ్ జిందాల్, InfiSpark, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ Ms. తనుషి, (NSDC ) AP & TS రాష్ట్ర ఎంగేజ్మెంట్ అధికారి V. ప్రశాంత్, మరియు సిబ్బంది పాలొగన్నారు.
APSSDC చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యాన్ని మరియు ఆర్థిక మంత్రి మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ పరిశ్రమల సహకారంతో APSSDC అనేక నైపుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు.
APSSDC (ఎండి&సి.ఈ.ఓ) ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియంకు ఇస్తున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రాం ప్రెవేశ పెట్టడం జరిగింది , నేడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాల ఉపయోగ పడుతాయిని యువతకు శిక్షణ ఉపాధి కలిపించటానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందు ఉంటుంది ని తెలియ జేశారు.ఆంధ్రప్రదేశ్ అంతటా మహిళలకు వర్క్‌ఫోర్స్‌లో చేర్చడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా వారిని ఉద్ధరించడానికి మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రేవేశ పెట్టింది.అందులో భాగంగా బాగా ప్రణాళికాబద్ధంగా మరియు నిర్వచించబడిన కోర్సు 4 రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబడింది.
1. డిజిటల్ ఉత్పాదకత
2. ఇంగ్లీష్
3. ఉపాధి
4. వ్యవస్థాపకత.
దశలో– I 30,000+ కంటే ఎక్కువ మంది విద్యార్థులు నమోదు చేయబడ్డారు మరియు 18000+ కంటే ఎక్కువ మంది అభ్యర్థులు మైక్రో సాఫ్ట్ గ్లోబల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్‌లో ధృవీకరించబడ్డారు.
మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ యొక్క ఫేజ్-2ని నిర్వహించడానికి APSSDC ముందుకు వచ్చింది.
ముగింపులో, APSSDC Microsoft మరియు Infi-Spark సహకారంతో, 10,000+ కంటే ఎక్కువ మంది మహిళలకు మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇవ్వబడుతుంది, ప్రతికూల స్థితిలో ఉన్న మహిళల జీవనోపాధి అవకాశాలను మెరుగు పరుస్తుంది మరియు సాంకేతిక నైపుణ్యాలు మరియు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







