ఆగస్టు 1న ప్రీమియం వెహికల్ ప్లేట్ల వేలం
- July 26, 2022
దుబాయ్: ప్రైవేట్ వాహనాలకు (H-I-K-L-M-N-O-P-Q-R-S-T-U-V-W-X-Y-Z) కోడ్‌ల కోసం 3, 4, 5 అంకెలతో కూడిన 350 ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌లను దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఆగస్టు1న వేలం వేయనుంది. ఈ 68వ ఆన్‌లైన్ వేలంలో ఆఫర్‌లో (O 260), (V 1102)తో ఉన్న సూపర్ నంబర్ ప్లేట్లు అధిక ధర పలికే అవకాశం ఉందని అథారిటీ తెలిపింది. ఈ ఆన్‌లైన్ వేలం కోసం బిడ్డింగుల ప్రక్రియ జూలై 25 నుండి ప్రారంభమైంది. ఇది సోమవారం (ఆగస్ట్ 1) ఉదయం 08:00 గంటల వరకు కొనసాగుతుంది. ఈ వేలంలో లైసెన్సింగ్ ప్లేట్‌ల విక్రయం 5% వ్యాట్‌కి లోబడి ఉంటుంది. బిడ్డింగ్ లో పాల్గొనే వారు RTAకి Dhs5,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అలాగే పార్టిసిపేషన్ ఫీజు Dhs120 చెల్లించాలి. క్రెడిట్ కార్డ్, దుబాయ్ డ్రైవ్ యాప్, ఉమ్ అల్ రామూల్, అల్ బార్షా లేదా దీరాలోని కస్టమర్స్ హ్యాపీనెస్ సెంటర్‌లలో చెల్లింపులు చేయవచ్చని అథారిటీ తెలిపింది. మరింత సమాచారం కోసం www.rta.ae పోర్టల్ చూడాలని కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







