ఎన్టీయార్ - కొరటాల సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్.!

- July 27, 2022 , by Maagulf
ఎన్టీయార్ - కొరటాల సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్.!

కొరటాల దర్శకత్వంలో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడో సెట్స్ మీదికి వెళ్లాల్సిన ఈ సినిమా ఇదిగో, అదిగో అంటూ ఆలస్యమవుతూ వస్తోంది.

కర్ణుడి చావుకు సహస్ర కారణాలు అన్నట్లుగా.. ఈ సినిమా ఆలస్యానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ ‘ఆచార్య’ సెటిల్‌మెంట్, ఈ సినిమా ఆలస్యానికి ఓ కారణమన్నారు. ఆ తర్వాత ఇంకో కారణమేదో చెప్పారు.

కథలో కీలకమైన మార్పులు జరుగుతున్నాయన్నారు. తాజాగా నిర్మాత కళ్యాణ్ రామ్ మరో కారణంతో తెరపైకి వచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అనూహ్యంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఎన్టీయార్. 

ఎప్పుడూ లేని విధంగా ప్యాన్ ఇండియా రేంజ్ స్టార్‌డమ్ దక్కించేసుకున్నాడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో. అంత పెద్ద హిట్ కొట్టాకా తర్వాతి సినిమా ఏం చేయాలో, ఎలాంటిది చేయాలో.. అనే టెన్షన్ వుండడం సహజమే. అదే టెన్షన్‌తో చాలా చాలా ఒత్తిడికి ఫీలవుతున్నాడట ఎన్టీయార్. ఫ్యాన్స్ అంచనాలు ఎలా వుంటాయో, సినిమా ఫలితం ఎలా వుంటుందో.. ఆడియన్స్ రిసీవ్ ఎలా వుంటుందో.? ఇలాంటి రకరకాల అనుమానాలు ఎన్టీయార్‌ని వెంటాడుతున్నాయట. ఎన్టీయార్‌నే కాదు, నిర్మాతగా తన మీదా ఒత్తిడి వుందనీ, అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com