దిశా పటానీ దృష్టిలో ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

- July 27, 2022 , by Maagulf
దిశా పటానీ దృష్టిలో ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

దిశా పటానీ అంటేనే ఫిట్ అండ్ ఫర్‌పెక్ట్‌కి కేరాఫ్ అడ్రస్. అలాంటిది దిశా పటానీ దృష్టిలో తాను ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్ కానే కాదట. అసలు ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్ అంటే కత్రినా కైఫ్ అని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది దిశా పటానీ.

అదేంటీ.? ఫిట్‌నెస్‌లో దిశా పటానీని కొట్టేవాళ్లే లేరుగా.. అని నెటిజన్లు అనుకుంటున్నారు. అవును అది నిజమే. అలాగే, కత్రినా కైఫ్ కూడా ఫిట్‌గానే వుంటుంది. కత్రినా కైఫ్‌లా మరీ అంత ఫిట్‌గా వుండడం ఎవ్వరికీ సాధ్యం కాదని దిశా చెబుతోంది. 
బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్‌ని వివాహమాడి కత్రినా కైఫ్ ఓ వైపు వైవాహిక జీవితాన్నీ, మరోవైపు సినిమాలతో కెరీర్‌నీ మ్యానేజ్ చేసుకుంటోంది. ఈ రెండూ డిఫరెంట్ లైవ్స్. సో, ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ ఫాలో చేయడమనేది అంత ఆషామాషీ విషయం కాదనేది బహుశా దిశా పటానీ అభిప్రాయమేమో. 

అందుకే, కత్రినా కైఫ్ ఫిట్‌నెస్ గురించి అలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చి వుండొచ్చు. అయితే, కత్రినా కైఫే కాదు, పెళ్లి తర్వాత కూడా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్న ముద్దుగుమ్మలు చాలా మందే వున్నారు మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com