హీరోలను టార్గెట్ చేసిన కొరియోగ్రఫర్: అసలు అమ్మకి ఏమైంది.!
- July 27, 2022
డాన్స్ కొరియోగ్రఫర్‌గా మంచి పేరున్న అమ్మ రాజశేఖర్‌కి ఈ మధ్య ఏమైంది.? వరుస పెట్టి హీరోలను టార్గెట్ చేస్తున్నాడు. పబ్లిక్‌గా హీరోలపై నోరు పారేసుకుంటున్నాడు. ఆయా హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడు.
కొరియోగ్రఫర్‌గా పేరు తెచ్చుకున్న అమ్మరాజశేఖర్, బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీతో పాటు ఒకింత నెగిటివిటీ కూడా పెంచుకున్నాడనే చెప్పాలేమో. ఇక, హౌస్ నుంచి బయటికి వచ్చాకా, ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కించాడు. అదే, ‘హైఫై’. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా, ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నాడీ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.
ఈ నేపథ్యంలో మొన్న నితిన్‌పై నోరు పారేసుకున్నాడు. తన సినిమా ఈవెంట్‌కి వస్తానని చెప్పి రాలేదంటూ నితిన్‌పై అవాకులు చవాకులూ పేలాడు.
ఆ తర్వాత హీరో గోపీచంద్‌ని జుగుప్సాకరంగా ఆడి పోసుకున్నాడు. ఇప్పుడు మరో హీరో జేడీ చక్రవర్తి పరువు కూడా తీసేసే పనిలో పడ్డాడు. అప్పుడెప్పుడో ‘ఉగ్రం’ సినిమా టైమ్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, సినిమా మధ్యలో జేడీ చక్రవర్తి వేలు పెట్టి కెలికేస్తాడంటూ ఆయన పరువు కూడా తీసేశాడు.
దీంతో అమ్మ రాజశేఖర్‌కి ఏమైంది.? ఆయన తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడా.? లేక హీరోల పరువు తీసే పనిలో బిజీగా వున్నాడా.? అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







