టూరిస్ట్ హాట్స్పాట్ 'క్లౌడ్ లాంజ్' మూసివేత
- July 28, 2022
యూఏఈ: భారీ వర్షాల కారణంగా టూరిస్ట్ హాట్స్పాట్ 'క్లౌడ్ లాంజ్'(ఖోర్ ఫక్కన్ అల్ సుహబ్ రెస్ట్ ఏరియా)ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ట్వీట్ చేసింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు మూసివేత నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఖోర్ ఫక్కన్లోని ఎత్తైన ప్రదేశం క్లౌడ్ లాంజ్ సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని ఖోర్ ఫక్కన్, ఇతర ప్రాంతాలలో ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఈరోజు తెల్లవారుజామున అల్ హరయ్-ఖోర్ ఫక్కన్ రహదారిపై రాళ్లు పడటంతో షార్జా పోలీసులు ఆ రోడ్డును మూసివేశారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా డ్రైవ్-త్రూ కోవిడ్-19 పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ఫుజైరా పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







