మహేష్ కన్నా ముందే బన్నీతో త్రివిక్రమ్.!
- July 28, 2022
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి వుంది. ఆగస్టు 16 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కాగా, ఈ లోపు అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
అందేంటీ.! ఈ కొద్ది రోజుల్లో అల్లు అర్జున్‌తో డైరెక్షన్ ఏంటీ.? అనుకుంటున్నారా.? ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం అల్లు అర్జున్‌తో కలిసి పని చేయబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే ఇలాంటి పలు కమర్షియల్ యాడ్ షూట్స్ చేసిన అనుభవం వుంది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి. అందుకే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ, ఆయనతో యాడ్స్ చేయించుకుంటుంటారు పలు వాణిజ్య సంస్థలు. తాజా యాడ్ షూట్ కోసం సదరు సంస్థ అక్షరాలా 45 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అలాగే, ఓ వైపు సినిమాలతో సత్తా చాటుతూనే మరోవైపు కమర్షియల్ యాడ్ షూట్స్ రేస్‌లోనూ దూసుకెళుతుంటాడు బన్నీ. మొన్నీమధ్యనే హరీష్ శంకర్‌తో కలిసి ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు బన్నీ.
ఇప్పుడు త్రివిక్రమ్‌తో మరో యాడ్ షూట్. పలు వాణిజ్య కంపెనీలు, తమ బ్రాండ్‌లకు డిమాండ్ పెంచుకోవడం కోసం, స్టార్ సెలబ్రిటీలను తమ బ్రాండ్ ప్రమోషన్లకు వాడుకోవడం ఎప్పటి నుంచో వస్తున్నదే.
ఇక, త్వరలోనే ‘పుష్ప 2’ సెట్స్ మీదికి వెళ్లనుండగా, ఈ లోపు ఒప్పుకున్న ఇలాంటి ఓ నాలుగైదు యాడ్ షూట్లు సింపుల్‌గా కానిచ్చేస్తున్నాడు అల్లు అర్జున్.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







