ఖతార్ లో వర్షాలు.. రెడీగా అత్యవసర బృందాలు
- July 29, 2022
దోహా: ఖతార్ మునిసిపాలిటీలలోని అన్ని ప్రాంతాలలో వర్షాల నేపథ్యంలో అత్యవసర బృందాలు రెడీగా ఉండాలని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వర్షాల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించేందుకు జాయింట్ రెయిన్‌ఫాల్ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేశారు. వాతావరణ శాఖతో నిరంతర సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో రెయిన్ రెస్క్యూ టీమ్స్ పనులను పర్యవేక్షిస్తుంది. అన్ని మునిసిపాలిటీలు, ముఖ్యంగా అల్ వక్రా, అల్ రేయాన్ మునిసిపాలిటీలలోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు గాలి, వానల కారణంగా నేలకూలిన చెట్ల తొలగింపునకు సంబంధించి మున్సిపాలిటీల్లోని ఉద్యానవన విభాగాలతో సమన్వయంతో పాటు నీటి లాగ్ లను తొలగించే ప్రక్రియను జాయింట్ రెయిన్‌ఫాల్ ఎమర్జెన్సీ కమిటీ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. పబ్లిక్ వర్క్స్ అథారిటీ సంఖ్య (188)తో పాటు, మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (184)లోని యూనిఫైడ్ కాల్ సెంటర్ ద్వారా 24 గంటలు ఫోన్ కాల్‌లను స్వీకరించే కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







