శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
- July 30, 2022
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద కిలోకి పైగా అక్రమ బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.నిందితుడు బంగారాన్ని పేస్ట్ గా మార్చి క్యాప్సిల్స్ రూపంలో శరీరం అంతర్భాగంలో దాచుకున్నాడు.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన అతనిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు. బంగారం వెలికి తీసిన అధికారులకు 1102 గ్రాముల బంగారం పట్టుబడింది.పట్టుబడ్డ బంగారం విలువ షుమారు 54 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.బంగారం స్వాధీనం చేసుకుని నిందితుని విచారణ చేస్తున్నారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!