8 మంది మోడల్స్ పై గ్యాంగ్ రేప్..67 మంది అరెస్ట్
- July 30, 2022
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అత్యంత దారుణం జరిగింది.దోపిడీలకు పాల్పడే ముఠా ఎనిమిదిమంది మోడల్స్ పై అత్యంత పాశవికంగా..క్రూరంగా గ్యాంగ్ రేప్ కు తెగబడ్డారు. మారణాయుధాలతో వారిని బెదిరించి మోడల్స్ పై సామూహిక అత్యాచారం చేశారు అక్రమ చొరబాటుదారులు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్ గ్రామంలో ఓ
మ్యూజిక్ వీడియో కు సంబంధించి పలువురు మోడల్స్ తో షూట్ చేస్తున్నారు. అదే సమయంలో మారణాయుధాలతో కొంతమంది షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చొరబడ్డారు. అక్కడ ఉన్న మోడల్స్‌పై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాదు..అక్కడున్న మగవాళ్ల బట్టలు ఊడదీసి..(వారిలో నటులు కూడా ఉన్నారు) వాళ్లతో డ్యాన్సులు చేయించారు. వారి ఇష్టానురీతిగా వ్యవహరించి పైశాచిక ఆనందం పొందారు.
నిందుతులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్ పోలీసులు.. అక్రమ మైనింగ్ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని..వారు తరచూ దోపిడీలకు పాల్పడతారని శుక్రవారం (29,2022) తెలిపారు. వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా.. మోడల్స్ కనిపించేసరికి వెర్రెత్తిపోయారని..అత్యాచారానికి తెగబడ్డారని..ఇలా జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
అత్యాచారానికి గురి అయిన మోడల్స్ 18 నుంచి 35 ఏళ్ల మధ్యవారే. షూటింగ్ లో ఉన్న మగవాళ్లతో నగ్నంగా డ్యాన్సులు చేయించి ఆపై అక్కడున్నవారి నంచి డబ్బు, నగలు దోచుకుపోయారు.దుండగులు ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేశారని ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపు అత్యంత దారుణానికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో 67 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు. కాగా..దక్షిణాఫ్రియాలో దేశంలో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం నమోదు అవుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







