దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన 'దోచేవారెవరురా' టీజర్
- July 31, 2022
హైదరాబాద్: IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా "దోచేవారెవరురా" సినిమా టీజర్ విడుదల చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు సినిమాల్లోని కామెడీ, ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న "దోచేవారెవరురా" కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.
బ్యానర్: IQ క్రియేషన్స్
దర్శకుడు: శివనాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
PRO: లక్ష్మీ నివాస్
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







