అరబ్ పార్లమెంట్ సెషన్ లో పాల్గొన్న ఒమానీ పిల్లలు
- July 31, 2022
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా విశ్వవిద్యాలయం నిర్వహించిన అరబ్ పార్లమెంట్ ఫర్ ది చైల్డ్ రెండవ సెషన్‌లో ఒమన్ సుల్తానేట్ పిల్లలు పాల్గొన్నారు. పార్లమెంటరీ విధులు, బాధ్యత తదితర అంశాలపై రూపొందించిన అరబ్ పార్లమెంట్ డిప్లొమాలో 17 అరబ్ దేశాలకు చెందిన 77 మంది ఆనర్స్ డిగ్రీని సాధించారు. పిల్లలలో పార్లమెంటరీ విలువలు, సూత్రాలను తెలియజేయడం, భవిష్యత్ పార్లమెంటేరియన్లుగా వారిని సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్సలెన్స్ డిగ్రీని పొందడం పట్ల పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటులోని బాలల హక్కుల కమిటీ ఉపాధ్యక్షుడు కడాస్ బింట్ అబ్దుల్లా అల్-రియామియా మాట్లాడుతూ.. ఆరు నెలల కోర్సులో భాగంగా విద్యార్థులకు నాయకత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఇతర పార్లమెంటరీ నైపుణ్యాల పట్ల అవగాహన కల్పించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







