కార్నిచ్‌లో నిలిచిన వర్షపు నీరు.. వీడియోలు వైరల్
- July 31, 2022
దోహా: వర్షపు నీటి తరలింపు నెట్‌వర్క్‌లో పనులు పూర్తికాకపోవడంతో కార్నిచ్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు వర్షాకాలం కోసం ముందస్తు సన్నాహక సూచనలను పాటించలేదని, వారిపై అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అష్ఘల్ అధ్యక్షుడు డాక్టర్ ఎంగ్ సాద్ అల్ ముహన్నడి తెలిపారు. గురువారం కురిసిన వర్షాలకు కార్నిచ్ స్ట్రీట్ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అష్ఘల్ అధ్యక్షుడు స్పందించారు. ఖతార్ ఎక్స్‌ప్రెస్‌వేల కోసం రెయిన్‌వాటర్ డ్రైనేజీ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కార్నిచ్, మిడ్‌టౌన్ దోహా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పనులు, రెయిన్‌వాటర్ డ్రైనేజీ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌ను అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







