డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ల వినియోగం.. 105,300 మందికి జరిమానా
- July 31, 2022
యూఏఈ: 2022 మొదటి ఆరు నెలల్లో అబుదాబి రోడ్లపై మొబైల్ ఫోన్లను ఉపయోగించినందుకు మొత్తం 105,300 మంది వాహనదారులకు జరిమానా విధించారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో డ్రైవర్లు ఫోన్లలో మాట్లాడటం లేదా మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియాలో చాట్ చేయడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఫోటోలు తీయడం లేదా వీడియోలు తీయడం వంటివి చేస్తూ పట్టుబడ్డారని అబుదాబి పోలీస్‌లోని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ మేజర్ మహ్మద్ దహీ అల్ హుమిరి తెలిపారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే నాలుగు బ్లాక్ పాయింట్లతో పాటు 800 దిర్హామ్‌లు జరిమానా పడుతుందన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం చాలా మంది వాహనదారులకు ముఖ్యంగా యువతకు వ్యసనంగా మారిందని, ఇది రహదారి భద్రతకు చాలా పెద్ద ప్రమాదకరం అని అల్ హుమిరి అన్నారు. డ్రైవర్లు మొబైల్ ఫోన్లో మాట్లాడటం, సోషల్ నెట్వర్క్ సైట్లను బ్రౌజ్ చేయడం లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఏకాగ్రత కోల్పోవడం, నిర్లక్ష్యం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లను పట్టుకునేందుకు అబుదాబి రోడ్లపై స్మార్ట్ పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేసినట్లు అబుదాబి పోలీసులు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







