యూఏఈలో తగ్గిన ఇంధన ధరలు
- August 01, 2022
యూఏఈ: గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఆగస్టు నెలకు సంబంధించి రిటైల్ ఇంధన ధరలను లీటరుకు 62 ఫిల్స్ వరకు యూఏఈ చమురు ధరల కమిటీ తగ్గించింది. సూపర్ 98ని జూలైలో లీటరుకు Dh4.63 నుండి ఆగస్టులో Dh4.03కి (13 శాతం) తగ్గించింది. స్పెషల్ 95 ధర 13.27 శాతం తగ్గి Dh4.52 నుండి Dh3.92 అయింది. అలాగే E-Plus 91 ధర 13.5 శాతం తగ్గి.. Dh 4.44 నుండి Dh 3.84కి తగ్గించింది. అదేవిధంగా డీజిల్ ధర జూలైలో 4.76 దిర్హామ్ లు ఉండగా.. దాన్ని 4.14 దిర్హాలకు(13 శాతం) తగ్గించింది. వరుసగా రెండు నెలలు ధరల పెరుగుదలతో చమురు ధరలు జూలైలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఈ సంవత్సరం బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ సైనిక సంక్షోభం తర్వాత మాంద్యం భయాల కారణంగా జూలైలో ధరలు $100 దిగువకు పడిపోయాయి. జూలై 5న చమురు ధరలు 10 శాతానికి పైగా పడిపోయాయి. MOpec+ కరెంట్ ఉత్పత్తి కోతలు ఆగస్టు చివరి నాటికి పూర్తిగా పునరుద్ధరించబడతాయని, సెప్టెంబరు నుండి ప్రతి ఒపెక్ సభ్యుడు తమ ఉత్పత్తిని స్వేచ్ఛగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉంటారని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా అన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..