‘సీతారామం’: క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్.!
- August 02, 2022
‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’, ‘లై’, ‘పడి పడి లేచె మనసు’, వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలతో తన మార్కు డైరెక్షన్ చూపించిన దర్శకుడు హను రాఘవపూడి. తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో ఇండస్ర్టీని ఎట్రాక్ట్ చేశాడీ డైరెక్టర్.
టాలీవుడ్ యంగ్ హీరోస్‌నే తన సినిమాల కోసం సెలెక్ట్ చేసుకునే హను రాఘవపూడి, ‘సీతారామం’ కోసం మలయాళ హీరోని ఎందుకు తీసుకొచ్చాడు.? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయ్.
ఏం.! తెలుగులో అంత గొప్ప నటులు లేరనేది హను రాఘవపూడి అభిప్రాయమా.? అనే యాంగిల్‌లో ఒకింత నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది హను రాఘవ పూడిపై. అయితే, అందుకు హను క్లారిటీ ఇచ్చేశాడు.
సినిమా రిలీజ్‌కి దగ్గరగా వున్న తరుణంలో చాలా జాగ్రత్తగా వుండాలి. అందుకే, తనపై వెల్లువెత్తుతున్న ఈ నెగిటివిటీని దూరం చేసుకోవాలని, హను వెంటనే రెస్పాండ్ అయ్యాడు.
‘సీతారామం’ కథ అనుకున్న టైమ్‌లో టాలీవుడ్ నుంచి హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరనీ, ఆ తరుణంలోనే దుల్కర్ సల్మాన్ ఐడియాకి వచ్చాడనీ, అందులోనూ ఈ సినిమా కోసం సైన్ చేసిన నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్ కూడా దుల్కర్‌ని సజెస్ట్ చేయడంతో, అనుకోకుండా తన కథలోకి దుల్కర్ వచ్చాడనీ హను రాఘవపూడి చెప్పాడు.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మండన్నా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 5న ‘సీతారామం’ రిలీజ్‌కి ముస్తాబయ్యింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







