వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ..
- April 13, 2016
డా.బిఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైసీపీ నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ పాటుపడ్డారని కొనియాడారు. అంబేడ్కర్ సూచనలను పాలకులు పాటించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలన్నారు. క్రిస్టియన్లో చేరిన ఎస్సీలకు కులసర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఎస్సీ,ఎస్టీల హక్కులను ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







