యజమాని ఆహారంలో పనిమనిషి మూత్రం పోయడంపై కేసు నమోదు
- April 13, 2016
ఒక సేవకురాలు తన యజమాని ఆహారంలో మూత్రం పోసిన ఆరోపణలు బుధవారం తలెత్తాయి ప్రజల జీవితాల్లో ముప్పు కలగాచేసినందుకు ఆమెపై అభియోగాలు నమోదు చేశారు.ఈ ఆరోపణను ఒక ఎమిరేట్ న్యాయవాది ఇలా వివరించారు, మూడు నెలల క్రితం ఈ సేవకురాలిని సంబంధిత కుటుంబం నియమించారు అని పనిమనిషి తయారుచేసిన ఆహారాన్నితీసుకుని గృహ యజమాని జబ్బుపడినట్లు ఆయన తెలిపారు.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తయారు చేస్తున్న ఆహారం తీసుకుని పరీక్షించగా అందులో మానవ మూత్ర సంబంధిత వ్యర్ధాలు ఉన్నట్లు..ఈ కారణంగా యజమానికి కడుపులో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందన ఆరోగ్య నివేదిక ఇచ్చారు. దీంతో ఆ పని మనిషిని ఒక వారం తరువాత అరెస్టు చేశారు.ఈ ఫిర్యాదు చేసిన ఆమె తల్లి తన కుమార్తెకు ఆహారం సిద్ధం చేసింది.అయితే, ఆ రోజు ఆమెకు పనిమనిషికి ఒక పోట్లాట జరిగింది. దీంతో పనిమనిషి తాను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. పిర్యాదురాలు ఈ విధంగా తెలిపింది "నా తల్లి పనిమనిషి గదిలో ఒక సీసాను కనుగొంది..అది ఏమిటని పనిమనిషిని నిలదీయగా...అదో రకమైన పానీయం అని చెప్పింది. తర్వాత పనిమనిషిని గట్టిగా అడిగితే, అది మూత్రం అని తెలిపింది. తనకు రాత్రుళ్ళు బాత్రూంకు వెళ్ళాలంటే భయమని అందుకే , ఆ సీసాలో నింపి ఉదయాన్నే పారవేస్తానని జవాబు ఇచ్చింది. అయితే, ఆ పనిమనిషి పోలీసులు ఎదుట తాను మామూలుగానే తన యజమాని కుటుంబం యొక్క ఆహారం మరియు పానీయాలలో తన మూత్రం చల్లుతానని అంగీకరించింది .అంతేకాక, ఆ పని మనిషి తన దేశంలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం, పనిచేసే చోట మూత్రం ఆహారంలో కలపడం ద్వారా ఆ కుటుంబ నియంత్రణ తన చేతుల్లో ఉంటుందని...కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులు మారుమాట్లాడకుండా తాను కోరుకొన్న జీతం పెంచడానికి అంగీకరిస్తారని అలా చేశానని పోలిసుల ఎదుట సమాధానం చెప్పింది.ఈ కేసు కోర్టులో విచారణ సందర్భంగా పనిమనిషి వివరణను న్యాయవాది ఖండించారు. ఎందుకంటే పనిమనిషి బాత్రూమ్ కు వెళ్ళడానికి భయపడ్డాననేది పెద్ద అబద్ధమని ఆమెకు కేటాయించిన టాయిలెట్ గదికి సమీపంగా రెండు మీటర్ల దూరం లో ఉంటుందని ఆయన న్యాయమూర్తికి తెలిపారు.ఆమె గదిలో ఐదుగురు పనిమనుషులు ఉన్నప్పటకీ, ఆమె ఒంటరిగా బాత్రూంకు వెళ్ళడానికి భయపడినపుడు...ఎందుకు ఎవర్నీ తోడు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదని న్యాయవాది వాదించారు .ఇరువురి వాదనలను విన్న జడ్జి ఈ కేసును మే మాసం చివరకు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







