అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో మళ్లీ గ్యాస్ లీక్..50 మంది అస్వస్థత
- August 03, 2022
అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా వాంతులు, వికారంతో చాలామంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి వైద్యం అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. హాస్పటల్స్ వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బి షిఫ్ట్‌లో పని చేసేందుకు ఫ్యాక్టరీకి 4 వేల మంది కార్మికులు వచ్చారు. మధ్యాహ్నం సమయంలోనే గ్యాస్ లీక్ అవుతున్నట్లు కొంత మంది ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడి సిబ్బంది ఆ వార్తలను కొట్టి పడేసినట్లు తెలుస్తోంది. సమయం గడిచే కొద్ది వాయువు గాఢత పెరిగి పలువురు మహిళలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. వెంటనే అక్కడి సిబ్బంది మహిళలందరినీ ఓ గదిలోకి పంపించి డోర్లు మూసేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆ గదిలో అప్పటికే విషవాయువు పరుచుకొని ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై, ఆర్తనాదాలు చేయడంతో తలుపులు తెరిచారని.. బాధితులందరినీ బయటకి తరలించారని బాధితుల్లో కొంత మంది చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..