అచ్చుతాపురం విషవాయువు లీక్ ఘటనపై సిఎం జగన్ ఆరా
- August 03, 2022
అమరావతి: ఏపిలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో విషవాయువు లీక్ ఘటనపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిం చాలని విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, కారణాలను వెలికితీయాలని అధికారుల ను ఆదేశించారు. భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. నిన్న సీడ్స్ దుస్తుల కంపెనీలో విషవాయువు లీకై 95 మంది అస్వస్థతకు గురై పలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రి అమర్నాథ్ ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







