ఆగస్టు 5-15 వరకు అన్ని మ్యూజియాలు, పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశం ఉచితం
- August 03, 2022
న్యూ ఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మ్యూజియాలు, పర్యాటక ప్రాంతాల్లో 10 రోజులపాటు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న అన్ని మ్యూజియాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
స్వదేశీయులతో పాటు విదేశీయుల నుంచి ఎలాంటి ప్రవేశ రుసుము వసూలు చేయబోమని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మ్యూజియాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లోనూ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.గోల్కొండ, చార్మినార్‌తో పాటు ఇతర సందర్శన ప్రదేశాలను పర్యాటకులు ఉచితంగా చూడవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







