‘ప్యాన్ ఇండియా’ పదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దుల్కర్ సల్మాన్.!
- August 03, 2022
ప్యాన్ ఇండియా అనే పదం ఇప్పుడు బాగా వినిపిస్తోంది. పలు భాషల్లో విడుదలయితే, ఆ సినిమాని ప్యాన్ ఇండియా సినిమా అనేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు.? ఈ ప్యాన్ ఇండియా అనే పదం ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.? గతంలోనూ చాలా మంది సీనియర్ హీరోల సినిమాలు పలు భాషల్లో విడుదలయ్యేవి.
అప్పుడు లేని ప్రచారం ఇప్పుడే ఎందుకు.? అదంతే అదో తుత్తి. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మంచి సినిమా అంటే సరిపోతుంది. ప్యాన్ ఇండియా సినిమా అని స్పెషల్ ట్యాగ్ ఎందుకు తగిలిస్తున్నారు.? అంటూ తనకు ప్యాన్ ఇండియా అనే పదమే నచ్చదని ఆయన చెప్పారు.
దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సందర్భంగా తొలిసారి ఆయన తెలుగు సినిమా ప్రమోషన్లలో బిజీగా తిరుగుతున్నారు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్, అప్పుడు అనారోగ్యం కారణంగా ప్రమోషన్లలో పాల్గొనలేకపోయారట.
కానీ, ఇప్పుడు తెలుస్తోందట. అప్పుడు తానేం మిస్సయ్యానో అని. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఆయన ఆశ్చర్యపోతున్నారట. ఎక్కడికి వెళ్లినా దుల్కర్‌పై ప్రేమాభిమానాలు చూపిస్తూ ఆయన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారట తెలుగు ప్రజలు. అంతేగా, తెలుగు ప్రజలు ఏం చేసినా అంతే ఘనంగా వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







