షూటింగులు బంద్: మాట మార్చేసిన దిల్ రాజు
- August 03, 2022
అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకునే చందంగా మారిపోయింది సినీ పరిశ్రమ పరిస్థితి. ముఖ్యంగా టాలీవుడ్ పరిస్థితి. ఇప్పుడెందుకీ చర్చ అంటారా.? అవును మరి, నిన్నేమో నిర్మాతలు డిమాండ్లు.. అదేనండీ సమస్యలు తీరే వరకూ షూటింగులు బంద్ చేసుకుంటున్నాం అని ప్రకటించిన మహానుభావులే తమ సినిమాల షూటింగులు ఆపుకోలేకపోయారు.
ఏంటిది అధ్యక్షా.! అని ప్రశ్నిస్తే, అది తెలుగు సినిమా కాదంటూ ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. తమిళ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఇంతవరకూ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన విజయ్, ఈ సినిమాతోనే స్ర్టెయిట్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు.. అంటూ ఇంతవరకూ ప్రచారం ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు బ్యానర్‌లో మన తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేలపైనే వైజాగ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, తాజాగా లేవనెత్తబడిన నిర్మాతల సమస్యలు, షూటింగ్స్ బంద్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా కాదట. సడెన్‌గా తమిళ సినిమా అయిపోయిందట.
తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసుకుంటున్నారట. అదీ దిల్ రాజు వర్గం చెబుతున్న మాట. తనకైతే ఓ న్యాయం. పరులకు మరో న్యాయం.. అంటే ఇదే కదా. ఈ సినిమా షూటింగ్ ఆగిపోకూడనే రాజా వారి వర్గం ఇలా ప్లేట్ ఫిరాయించేశారు మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







