అందుకే తెలుగు సినిమా చేయలేకపోతున్నా: క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్.!

- August 03, 2022 , by Maagulf
అందుకే తెలుగు సినిమా చేయలేకపోతున్నా: క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్.!

అతిలోక సుందరి జాన్వీ కపూర్ దాదాపు పదేళ్లు కావస్తోంది హీరోయిన్ అనే ట్యాగ్ వేయించుకుని. కానీ, ఇంతవరకూ తెలుగులో, ఆ మాటకొస్తే సౌత్‌లో తెరంగేట్రం చేయలేకపోయింది. ప్రతిసారీ ఈ విషయంపై జాన్వీ కపూర్‌ని మీడియా ప్రశ్నిస్తూనే వుంటుంది అవకాశం వచ్చినప్పుడల్లా.
తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. నిజానికి జాన్వీ తొలి సినిమా తెలుగులోనే చేయాలని, ఇంట్లో ఆమె తల్లి శ్రీదేవి, తండ్రి బోనీకపూర్ అనుకున్నారట.డెబ్యూ మూవీ తెలుగు సినిమా కానీ, లేదంటే ఏదైనా సౌత్ మూవీ కానీ అవుతుందని ఇంట్లో పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచిందట. 
కానీ, అనుకోని కారణాలతో అది జరగలేదట. అయితే, సౌత్‌లో సినిమాలు చేయకూడదనేం లేదనీ, ఏదో ఒక సినిమాతో డెబ్యూ చేసే కన్నా, ఓ మంచి సినిమాతో డెబ్యూ చేయాలని భావిస్తోందట. ఆ వుద్దేశ్యంతోనే ఇంకా సౌత్ తెరంగేట్రంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయనీ జాన్వీ తాజాగా వెల్లడించింది. 
బాగానే వుంది కానీ, ఈ పదేళ్లలో తెలుగు నుంచి కానీ, సౌత్ నుంచి కానీ, ఏ ఒక్క మంచి సినిమా కూడా రాలేదనే జాన్వీ అభిప్రాయమా.? అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేగా మరి. ఎంతో మంది స్టార్ హీరోలు, ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. ఆయా సినిమాల్లో జాన్వీ కపూర్ పేరు కూడా ప్రస్థావనకొచ్చింది. చావు కబురు చల్లగా అన్నట్లు.. ఇన్నేళ్ల తర్వాత ‘మంచి సినిమా దొరకలేదు..’ అనే ఆరోపణ ఎంత వరకూ సబబు.? జూనియర్ అతిలోక సుందరీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com