పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణమని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

- August 03, 2022 , by Maagulf
పింగళి వెంకయ్య తెలుగు జాతికి గర్వకారణమని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
న్యూ ఢిల్లీ: భారత జాతీయ పతాక రూపకర్త  పింగళి వెంకయ్య వారసులు బుధవారం నాడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని కలిశారు.కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన వారిని ఉపరాష్ట్రపతి శాలువతో సత్కరించారు. 
 
భారతదేశ ప్రజల విజయధ్వజమైన, భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు ప్రజలకు గర్వకారణమని తెలిపారు.భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైనదని తెలిపారు.వారి కార్యదీక్ష, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
పింగళి సుశీల దశరథ రామన్,పింగళి వెంకయ్య దశరథ రామన్ (ముని మనుమడు), ఘంటసాల గోపీకృష్ణ,ఘంటసాల వాసుదేవ నరసింహన్,ఘంటసాల కృష్ణ ప్రవీణ్ తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com