రష్మిక అలా చేయదే.. కానీ ఎందుకలా చేసిందబ్బా.!
- August 04, 2022
హీరోయిన్లు ప్రమోషన్లలో పాల్గొనడం చాలా సహజం. షూటింగ్ పార్ట్‌కి ఇచ్చే డేట్స్‌తో పాటే, ప్రమోషన్స్ కోసం కూడా కొన్ని డేట్స్ కేటాయిస్తుంటారు అందాల భామలు. ఎవరో నయనతార లాంటి వాళ్లు తప్ప, ప్రతి ఒక్క హీరోయిన్ ప్రమోషన్లలో పాల్గొనాల్సిందే.
అందులో రష్మిక మండన్నా లెక్క వేరే లెవల్. ప్రమోషన్లలో రష్మిక చాలా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంటుంది. చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది ప్రమోషన్లలో. తన మాటల గారడితో, ఫ్యాన్స్‌లో కొత్త వుత్సాహం కలిగిస్తుంటుంది.
అలాంటి రష్మిక మండన్నా, ‘సీతారామం’ ప్రమోషన్లలో ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమాలో రష్మిక ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. ప్రచార చిత్రాల్లో తప్ప, రష్మిక హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. కనీసం తన సోషల్ మీడియా అకౌంట్లోనూ ‘సీతారామం’ గురించి ఏ విధమైన హడావిడీ చేయడం లేదు.
అందుకు కారణం ఏంటో తెలీదు కానీ, రష్మిక ఎందుకిలా చేస్తోంది.? టీజర్, ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా కీలకమైనదే అనిపిస్తోంది. అలాంటప్పుడు ఎందుకని రష్మిక ఒక్కసారి కూడా ప్రమోషన్లకు రాలేదు. పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమా కావడంతో, ఈ సినిమాని చాలా గ్రాండియర్‌గా ప్రమోట్ చేస్తున్నారు.
కానీ, ఆ ప్రమోషన్లలో రష్మిక ఎక్కడా కనిపించకపోవడం ఫ్యాన్స్‌ని చాలా డిజప్పాయింట్ చేస్తోందట. ఆగస్ట్ 5 ‘సీతారామం’ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







